భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 63వ వర్ధంతి కార్యక్రమం గుంటూరులో జరిగింది. అంబేడ్కర్ వర్ధంతిని పురస్కరించుకుని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత ఆయన విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేడ్కర్ చేసిన సేవలను హోంమంత్రి గుర్తు చేసుకున్నారు. ప్రతి ఒక్కరు అయన ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. అంబేడ్కర్ అడుగుజాడల్లో నడిచి ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆకాంక్షించారు. దిశ హత్యకేసులో పోలీసులు వ్యవహరించిన తీరును స్వాగతిస్తున్నామని హోంమంత్రి అన్నారు.
రాజకీయ ప్రముఖుల నివాళి
తెదేపా నేతలు నక్కా ఆనందబాబు, డొక్కా మాణిక్యవరప్రసాద్, జీవీ ఆంజనేయులు, మద్దాలి గిరిధర్, బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ, పలువురు నేతలు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దిశ హత్యకేసులో నిందితుల ఎన్కౌంటర్పై స్పందించిన నేతలు దిశకు అసలైన న్యాయం జరిగిందని అన్నారు. ఇలాంటి కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు పడినప్పుడే మృగాళ్లు భయపడతారని అన్నారు.
ఇదీ చదవండీ: