Amaravati Farmers Protest Reached to Four Years: అమరావతి పరిరక్షణ ఉద్యమానికి నాలుగేళ్లు పూర్తైన సందర్భంగా రాజధానిలో రైతులు, మహిళలు నిరసన కార్యక్రమాలు హోరెత్తించారు. జగన్ నయవంచనకు నాలుగేళ్లంటూ దీక్షా శిబిరాల్లో నినదించారు. అవిశ్రాంతంగా పోరాడిన తమ త్యాగం ఊరికే పోదన్న మహిళలు, ఇంకో 3 నెలల్లో జగన్ ఇంటికి పోవడం ఖాయమని తేల్చిచెప్పారు.
మూడు రాజధానుల ప్రకటనతో ఉద్యమబాట పట్టిన అమరావతి రైతులు, వ్యవసాయ కూలీలు, మహిళలు తమ సంకల్పాన్ని ఘనంగా చాటారు. అమరావతి పరిరక్షణ ఉద్యమానికి నాలుగేళ్లు పూర్తై, 1461వ రోజుకు చేరిన సందర్భంగా తుళ్లూరులో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత జెండా వందనం చేసి అమరావతికి అభివందనం చేశారు. తర్వాత హిందూ, ముస్లిం, క్రిస్టియన్ పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆమరావతికి ఆశీస్సులు అందించారు. అమరావతి చిరకాల రాజధానిగా నిలుస్తుందని దీవించారు. ఉద్యమ అమరవీరులకు రైతులు నివాళులు అర్పించారు.
"అమరావతి పరిరక్షణ ఉద్యమంలో తుది దశకు చేరుకున్నాం. మలిదశ, చివరిదశ నాకు తెలిసినంత వరకు మరో 100రోజుల తర్వాత ఉద్యమం చేయాల్సిన అవసరం ఉండదు. మన జీవితాలను నాశనం చేసి, మన బిడ్డలను బజారు పాలు చేశారు. అటువంటి వైసీపీ పార్టీని అధికారం నుంచి దూరం చేసే సువర్ణ అవకాశం మనకు మరో 100 రోజుల్లో ఉంది." -అమరావతి రైతు సంఘం నేత
అమరావతి రైతులకు హైకోర్టులో ఊరట, విచారణకు అనుమతించిన హైకోర్టు- కానీ?
జగన్ మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలి. ఏపీ హేట్స్ జగన్. జగన్ మోహన్ రెడ్డి నీకు ఈ రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదు. నీకు అర్హత లేదని నీ పాలనతో నువ్వే నిరూపించుకున్నావు. అందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిన్ను ఇంటికి పంపిచడానికి సిద్ధంగా ఉన్నారు." - అమరావతి రైతు
అనంతరం ప్రభుత్వం తీరును నిరసిస్తూ వినూత్న నిరసన చేపట్టారు. దున్నపోతు ముందు బూరలు ఊదుతూ వినతిపత్రం సమర్పించారు. నాలుగేళ్లుగా అమరావతి ఉద్యమం సాగుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. తమపై అక్రమ కేసులు పెట్టిన జగన్ ఇక ఇంటికి పోక తప్పదని హెచ్చరించారు. అమరావతి ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని రైతులు తేల్చి చెప్పారు. తమను వంచించిన జగన్ మూల్యం చెల్లించుకోక తప్పదని మహిళలు తేల్చి చెప్పారు.
Police attack on Rythu Diksha camp : అమరావతి రైతు శిబిరంపై పోలీసుల దాడి.. మహిళలు, వృద్ధులను సైతం...
తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నాను. రాజధానిని ఇంకా గొప్పగా చేస్తానని చెప్పావు. తాడేపల్లిని వదిలేసి మళ్లీ వైజాగ్ పోవాలని అక్కడ కోట్ల రూపాయలు ఖర్చు చేసి అక్కడో ఇల్లు కట్టుకున్నావు. మేము రోడ్ల మీద పడి ఏడుస్తున్నాము. మేము భూములు ఇచ్చినందుకు మా పిల్లలు ఏమై పోవాలి. " - అమరావతి రైతు
నాలుగేళ్ల ఉద్యమం సందర్భంగా పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజాసంఘాల నాయకులు సభకు హాజరై అమరావతి రైతులు, మహిళలకు సంఘీభావాన్ని తెలియజేశారు. వచ్చే ఎన్నికల్లో కలిసి కట్టుగా పోరాడి జగన్‌ను ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు.
'నేను కూడా నిన్న మొన్నటివరకు'..నోరు జారిన ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ