గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అనంతవరం శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి పుష్పయాగం నిర్వహించారు. తితిదే ఆధ్వర్యంలో నిర్వహించిన యాగంలో రాజధాని రైతులు, భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
దాదాపు 12 రకాల పూలతో ఈ యాగం నిర్వహించారు. యాగం అనంతరం రైతులు, మహిళలు జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. ఏకైక రాజధానిగా అమరావతే కొనసాగాలని స్వామివారిని వేడుకున్నామని వారు తెలిపారు.
ఇదీ చూడండి: