రాజధాని అమరావతిని కాపాడాలంటూ తుళ్లూరులో రైతులు, మహిళలు శ్రీరామచంద్ర ప్రభువుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాని మోదీ అయోధ్యలో రామాలయానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా తుళ్లూరులో రైతులు, మహిళలు రాముని చిత్రపటానికి, న్యాయదేవతే తమను కాపాడాలంటూ హైకోర్టు చిత్రపటానికి ప్రత్యేకంగా క్షీరాభిషేకం చేశారు.
ప్రధానిమంత్రి మోదీ గతంలో రాజధాని అమరావతికి శంకుస్థాపన చేశారని అమరావతి రైతులు గుర్తు చేశారు. ఇప్పుడు మూడు రాజధానుల నిర్ణయంతో తమ జీవితాలు అగమ్యగోచరంగా మారాయని రైతులు, మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ అమరావతి కలలను సాకారం చేయాలని... శ్రీరాముడు ఆయన మనసు కరిగించాలని రైతులు, మహిళలు వేడుకున్నారు.
ఇదీ చదవండి