Amaravati Farmers Movement Reached 1400 Days: జగన్ ఎంత ప్రయత్నించినా అమరావతిని కదిలించలేరు.. ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన రైతులు - అమరావతి
Amaravati Farmers Movement Reached 1400 Days: అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఉద్యమం 1400 రోజులకు చేరుకుంది. ఈ సందర్భంగా నేడు తుళ్లూరు దీక్షా శిబిరంలో పలు కార్యక్రమాలు చేపట్టిన రైతులు.. అమరావతి రాజధానిగా కొనసాగాలని కోరుతూ హోమాలు నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 17, 2023, 3:40 PM IST
|Updated : Oct 17, 2023, 5:03 PM IST
Amaravati Farmers Movement Reached 1400 Days: ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఉద్యమం 1400 రోజులకు చేరింది. ఈ సందర్భంగా తుళ్లూరు దీక్షా శిబిరం వద్ద రైతులు, మహిళలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అమరావతికి అంతా మంచే జరగాలని, చంద్రబాబు నాయుడు ఆరోగ్యం బాగుండాలని, ఆయనకు త్వరగా బెయిల్ రావాలని పూజలు, అభిషేకాలు నిర్వహించారు. సీఎం జగన్ ఎన్నిరకాలుగా ప్రయత్నించినా అమరావతిని కదిలించలేరని రాజధాని రైతులు ధీమా వ్యక్తంచేశారు. ప్రజలను మభ్య పెట్టడానికే 3 రాజధానులంటూ పూటకో ప్రకటన చేస్తున్నారని మండిపడ్డారు.
అమరావతి రాజధానికి అన్యాయం చేస్తోన్న జగన్కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎలుగెత్తి చాటుతామని రాజధాని రైతుల ఐక్య కార్యాచరణ సమితి వెల్లడించింది. రాజధాని అమరావతి రైతుల ఉద్యమానికి 1400 రోజులైన సందర్భంగా విజయవాడ ఆటోనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైతుల ఐకాస కన్వీనర్ పువ్వాడ సుధాకర్, దళిత, మైనార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.
Amaravati Framers Protest Completed 1400 Days: 1400 రోజులు పూర్తిచేసుకున్న అలుపెరుగని పోరాటం..
ఈ సందర్భంగా తమ భవిష్యత్తు కార్యాచరణను వారు వెల్లడించారు. అమరావతి రాజధానిని వైసీపీ ప్రభుత్వం ధ్వంసం చేసిందని.. రాజధానిగా అమరావతిని నిర్ణయించేటప్పుడు జగన్ ఏం చేశారని సుధాకర్ ప్రశ్నించారు. విశాఖపట్నం వెళ్తానని సీఎం పదే పదే చెప్పడం ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికేనని సుధాకర్ ఆరోపించారు. భవిష్యత్తులో రైతుల ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని.. ఒక్కో రైతు ఒక్కో సైనికుడై రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో తమ గళాన్ని వినిపిస్తారని చెప్పారు.
ఎన్నికలకు ముందు గడప గడపకు తిరిగి సీఎం జగన్ దాష్టీకాలను ప్రజలకు ఎలుగెత్తి చాటిచెబుతామని చెప్పారు. ఇప్పటివరకు 1475 మంది రైతులు, మహిళలపై కేసులు నమోదు చేశారని.. మూడు రాజధానులంటూ 270 మంది రైతుల్ని పొట్టన పెట్టుకున్నారని ఆయన ఆరోపించారు. అమరుల ఆశయ సాధనకు నిరంతరం కృషి చేస్తామని.. ఎన్ని కేసులు పెట్టినా రైతుల ఆత్మవిశ్వాసాన్ని వైసీపీ ప్రభుత్వం దెబ్బతీయలేదని సుధాకర్ స్పష్టం చేశారు. రాజధానిలో దళితులు, మైనార్టీలకు జరుగుతున్న అన్యాయంపై ఆ ప్రతినిధులు గళం విప్పారు.
Amaravathi farmers yagam: "రైతుల కన్నీటి కడలిలో వైసీపీ ప్రభుత్వం కొట్టుకుపోతుంది"
ప్రతి మీటింగ్లో నా ఎస్సీ, నా ఎస్టీ అనే ముఖ్యమంత్రి.. అమరావతిలోని దళితులను ఎందుకు పట్టించుకోవడం లేదని దళిత మహిళా ఐకాస కన్వీనర్ స్వర్ణలత ప్రశ్నించారు. దళితుల ఓట్లలో అధికారంలోకి వచ్చిన జగన్.. ఇప్పుడు కులాలు, మతాల మధ్య గొడవలు పెడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు విశాఖ వెళ్లి ప్రపంచ స్థాయి నగరాన్ని చేస్తానంటున్న ముఖ్యమంత్రి జగన్.. నాలుగున్నరేళ్లు అమరావతిలో ఉండి దీనిని ఎందుకు అభివృద్ధి చేయలేదని నిలదీశారు. జగన్ మోహన్ రెడ్డి ఎక్కడ అడుగుపెట్టినా అక్కడ అభివృద్ధి పాతాళానికి పోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
YCP Govt Neglecting on Amaravathi: అమరావతిని ముంచాలని వైసీపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందా..!