ETV Bharat / state

'అమరావతి కోసం ఎన్నాళ్ల‌యినా.. ఎన్నేళ్ల‌యినా పోరాడతాం'

రాజధాని అమరావతి కోసం ఎన్నాళ్లయినా పోరాటం చేస్తామని రైతులు, మహిళలు స్పష్టం చేశారు. గుంటూరులో అమరావతికి మద్దతుగా దీక్షలు చేపట్టారు. సీఎం జగన్ ఇప్పటికైనా రాజధానిగా అమరావతే ఉంటుందని ప్రకటన చేయాలని కోరారు.

amaravathi protests in guntur
గుంటూరులో అమరావతి దీక్షలు
author img

By

Published : Jul 26, 2020, 3:25 PM IST

రాజధాని అమరావతి ఉద్యమం 222 రోజులకు చేరిన సందర్భంగా గుంటూరు చంద్రమౌళినగర్​లో రైతులు, మహిళలు పోరాట దీక్షలు నిర్వహించారు. కరోనా కారణంగా భౌతిక దూరం పాటిస్తూనే తమ నిరసన గళాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి వినిపించే ప్రయత్నం చేశారు.

సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు ఈ దీక్షలను ప్రారంభించారు. భూములిచ్చి మోసపోయామని... 3 రాజధానుల పేరుతో తమ జీవితాలను ముక్కలు చేయవద్దంటూ రాజధాని రైతులు, మహిళలు వేడుకున్నారు. తమ బతుకు, భవిష్యత్తు ముడిపడి ఉన్న అమరావతి కోసం ఎన్నాళ్ల‌యినా.. ఎన్నేళ్ల‌యినా పోరాడతామని స్పష్టం చేశారు. అలుపెరుగని పోరాటంతో ప్రభుత్వానికి ఇకనైనా కనువిప్పు కలగాలని.. రాజధానిగా అమరావతినే కొనసాగిస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటన చేయాలని ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి...

సీట్లను భర్తీ చేసుకునేందుకు ప్రైవేటు కళాశాలల ప్రయత్నాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.