'న్యాయం గెలుస్తుంది- అమరావతి నిలుస్తుంది' అనే నినాదాలతో 304వ రోజు అమరావతి దీక్షలు కొనసాగాయి. ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బోరుపాలెం మహిళా రైతులు ఆందోళనలో పాల్గొన్నారు. వర్షాన్ని లెక్క చేయకుండా రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ.. మహిళలు, చిన్నారులు నిరసనలో పాల్గొన్నారు.
సామాజిక మాధ్యమాల్లో మహిళా రైతులపై అసభ్యకర పోస్టులు పెట్టేవారికి అధికార పార్టీ ఎమ్మెల్యేలు కొమ్ముకాయడం సిగ్గుచేటన్నారు. తమపై అసభ్యకర పోస్టులు పెట్టేవారికి మద్దతు పలుకుతూ తిరిగి తమపైనే కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. 304 రోజులుగా సుదీర్ఘంగా పోరాడుతున్నా.. స్థానిక ఎమ్మెల్యేలు స్పందించకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి..
దుర్గ గుడి పైవంతెన ప్రారంభం.... వర్చువల్గా పాల్గొన్న జగన్, గడ్కరీ