ETV Bharat / state

'ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలి' - మూడు రాజధానులు తాజా వార్తలు

అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఉద్యమం 272వ రోజుకు చేరుకుంది. వర్షంలోనూ ఆందోళనలు చేపట్టిన రైతులు.. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ డిమాండ్ చేశారు.

'ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలి'
'ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలి'
author img

By

Published : Sep 14, 2020, 4:22 PM IST

పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రైతులు చేస్తున్న ఉద్యమం 272వ రోజుకు చేరుకుంది. తుళ్లూరు, మందడం, వెలగపూడి, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, అనంతవరం, రాయపూడి, పెదపరిమి, దొండపాడు గ్రామాల్లో రైతులు ఆందోళనలను కొనసాగించారు. దొండపాడులో రాజధాని రైతుల పరిరక్షణ ఆధ్వర్యంలో దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

తుళ్లూరులో మహిళలు లలితా సహస్రనామస్తోత్ర పారాయణం, ఓం నమః శివాయ మహామంత్రం, గేయామృతం చేశారు. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని మహిళలు రైతులు దైవారాధన చేశారు. అబ్బరాజుపాలెం, కృష్ణాయపాలెంలో రైతులు వర్షంలోనూ ఆందోళనను కొనసాగించారు. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రైతులు డిమాండ్ చేశారు.

ఇదీచదవండి

ఫిబ్రవరిలోగా అంతర్వేది రథాన్ని నిర్మిస్తాం: మంత్రి వెల్లంపల్లి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.