ETV Bharat / state

Amaravati Farmers: 'న్యాయస్థానం నుంచి దేవస్థానం' మహా పాదయాత్ర.. తొలిరోజు సాగిందిలా..

author img

By

Published : Nov 1, 2021, 8:42 PM IST

Updated : Nov 2, 2021, 5:11 AM IST

అమరావతి ఆవశ్యకతను రాష్ట్రవ్యాప్తంగా తెలియచెప్పేందుకు ఓ మహా సంకల్పానికి రాజధాని రైతులు శ్రీకారం చుట్టారు. 45 రోజుల పాటుసాగే సుదీర్ఘ పాదయాత్రకు నాంది పలికారు. కోర్టులు, దైవాలే తమను కాపాడతారన్న ఆశతో న్యాయస్థానం నుంచి దేవస్థానం పాదయాత్ర ప్రారంభించారు. తొలిరోజు యాత్ర తుళ్లూరు వద్ద ప్రారంభమై తాడికొండ వద్ద ముగిసింది.

'న్యాయస్థానం నుంచి దేవస్థానం' మహా పాదయాత్ర

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాజధాని అమరావతి రైతుల మహా పాదయాత్ర ప్రారంభమైంది. తిరుమల వరకు సాగే యాత్రను తుళ్లూరులోని దీక్షా శిబిరం వద్ద ఉదయం 9 గంటల 5 నిమిషాలకు మొదలుపెట్టారు. ముందు వరుసలో తిరుమలేశుడి విగ్రహం, ఆలయ నమూనాతో కూడిన వాహనాన్ని ఉంచారు. ఆ తర్వాత కళాకారుల బృందాలు, రైతులు పాదయాత్రగా బయల్దేరారు. యాత్ర సజావుగా సాగేందుకు 20 కమిటీలతో ఏర్పాట్లు చేశారు. దీక్షా శిబిరంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ దైవాల చిత్రపటాలతో పాటు న్యాయదేవత ప్రతిమకు పూజలు చేశారు.

తొలి రోజున మహిళలు, రైతులు, విద్యార్థులనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ యాత్రలో ఉత్సాహంగా నడిచారు. హైకోర్టు న్యాయవాదులు సైతం పెద్దఎత్తున పాల్గొన్నారు. తమ సమస్యలకుపాట రూపాన్నివ్వడమేగాక.. యాత్ర చేస్తున్న రైతుల్లో ఉత్సాహం నింపేందుకు కళాబృందాలు హుషారైన పాటలను ఆలపించాయి. ఈ మహా పాదయాత్ర చారిత్రకంగా మిగిలిపోతుందని రైతులు, ఐకాస నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు.

వివిధ పార్టీ నేతల మద్దతు..
అమరావతి ప్రజల ఆకాంక్షకు వివిధ పార్టీల నేతలు మద్దతు పలికారు. రైతులు, మహిళలతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ తరపున సీనియర్ నేతలు దేవినేని ఉమా, ప్రతిపాటి పుల్లరావు, నక్కా ఆనందబాబు, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పాదయాత్ర ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమరావతి ఏకైక రాజధాని కొనసాగేవరకు తమ మద్దతు సాగుతుందని నేతలు తెలిపారు. అమరావతి రైతుల మహా పాదయాత్ర గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల మీదుగా సాగనుంది.

పాదయాత్రలో నారాయణ

తుళ్లూరులో ప్రారంభమైన మహాపాదయాత్ర

నవ యువకులు కదం తొక్కారు. నారీమణులు పదం కలిపారు. కర్షక జనం కదలివచ్చారు. హరిత పతాకాలు రెపరెపలాడగా.. జై అమరావతి గీతాలు, నినాదాలు మార్మోగగా.. ఉద్యమకారులు ఉక్కు సంకల్పంతో ఒక్కటై కదిలారు. తమ గుండె ఘోషను దారి పొడవునా వినిపిస్తూ.. అమరావతి రైతులు తుళ్లూరు నుంచి తిరుమల వరకు మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఉద్యమానికి ఆది నుంచీ వెన్నుదన్నుగా నిలిచిన మహిళలు మహా పాదయాత్రలోనూ ముందుండి నడిచారు. రాజధాని రైతులు కుటుంబాలతో సహా కదలివచ్చారు. వృద్ధులు సైతం ఉద్యమ స్ఫూర్తితో ముందుకొచ్చారు. అమరావతి పరిరక్షణే ధ్యేయంగా 685 రోజులుగా రాజధాని గ్రామాల ప్రజలు, రైతులు, వారికి మద్దతిస్తున్న వివిధ వర్గాలవారు సాగిస్తున్న ఉద్యమం ఈ పాదయాత్రతో మరో కీలక ఘట్టానికి చేరుకుంది. ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పేరుతో చేపట్టిన ‘మహా పాదయాత్ర’ సోమవారం ఉదయం తుళ్లూరులో ఉద్విగ్నభరిత వాతావరణంలో ప్రారంభమైంది. రాజధాని అమరావతి పరిరక్షణ కోసం పరితపిస్తున్న ప్రజలు, భూములిచ్చిన రైతులు సాగిస్తున్న ఈ ‘లాంగ్‌ మార్చ్‌’కు దారి పొడవునా ప్రజలు నీరాజనాలు పట్టారు. పాదయాత్రకు వైకాపా తప్ప అన్ని రాజకీయ పార్టీలు మద్దతిచ్చాయి. వివిధ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు హాజరై సంఘీభావం ప్రకటించారు. రాజధాని రైతుల పోరాటానికి తెలంగాణ నుంచీ మద్దతు లభిస్తోంది. ఆ రాష్ట్రానికి చెందిన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రేణుకా చౌదరి పాదయాత్రలో పాల్గొన్నారు.

ఉద్వేగం.. ఉత్సాహం

గుండెల నిండా ఉద్వేగంతో, అమరావతి పరిరక్షణకు కంకణబద్ధులై రైతులు, ఐకాస నేతలు ముందుకు సాగారు. మొదట తుళ్లూరులోని శివాలయంలో పూజలు నిర్వహించారు. వేంకటేశ్వరస్వామి, బుద్ధుడు, న్యాయదేవత విగ్రహాల్ని ఉంచిన రథానికి పూజలు చేసి, ఉదయం 9.05 గంటలకు ‘మహా పాదయాత్ర’ ప్రారంభించారు. పాదయాత్ర నిర్విఘ్నంగా కొనసాగాలంటూ తుళ్లూరులోని శిబిరంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు చేస్తున్న పాదయాత్రకు సంకేతంగా, వేంకటేశ్వరస్వామి వేషధారణలో ఒక బాలుణ్ని, న్యాయదేవత వేషధారణలో ఓ బాలికను ముందుంచి పాదయాత్ర ప్రారంభించారు.

పాదయాత్రలో తెదేపా నేతలు

మహాపాదయాత్రలో పాల్గొన్న మాజీ మంత్రులు దేవినేని ఉమా, ప్రత్తిపాటి పుల్లారావు,

మాజీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌ తదితరులు

సమూహంగా వచ్చి.. ప్రవాహంలా కదిలి..

రెండేళ్ల క్రితం వరకు వారికి బతుకు పోరాటం ఒక్కటే తెలుసు. ఉద్యమాల గురించి వినడమే తప్ప.. తామే ఉద్యమం చేయాల్సి వస్తుందని, అది కూడా ప్రభుత్వంపై సుదీర్ఘకాలం పోరాడాల్సి వస్తుందని వారు కలలో కూడా ఊహించలేదు. 2019 డిసెంబరు 17న ముఖ్యమంత్రి జగన్‌ శాసనసభలో చేసిన మూడు రాజధానుల ప్రకటనతో వారంతా ఉద్యమబాట పట్టారు. వారిలో అరెకరం భూమి ఉన్న సన్నకారు రైతులు, సెంటు భూమైనా లేని రైతు కూలీలు కూడా ఉన్నారు. ప్రభుత్వ, పోలీసు ఆంక్షల్నీ తట్టుకుని, ఎండనక, వాననకా ఉద్యమ నినాదం వినిపిస్తూనే ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల ప్రజల్లోనూ ఉద్యమ స్ఫూర్తిని నింపేందుకు సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి మూడు రాజధానుల ప్రకటన చేసి, డిసెంబరు 17కి రెండేళ్లవుతుంది. ఆ రోజుకు తిరుమల చేరుకునేలా నాలుగు జిల్లాల మీదుగా 45 రోజులపాటు చేపట్టిన మహా పాదయాత్రకు రాజధాని ప్రజలు ప్రవాహంలా కదిలారు. కొందరు తిరుమల వేంకన్నకు ముడుపులు కట్టారు.

అమరావతిని రక్షించాలని నినదిస్తూ

* ‘సేవ్‌ అమరావతి’ అంటూ ప్లకార్డులతో పాదయాత్రలో పాల్గొన్న రైతులు

వర్షాన్నీ లెక్క చేయకుండా..

తుళ్లూరులో ఉదయం 9.05 గంటలకు మొదలైన పాదయాత్ర మధ్యాహ్నం 12.45 గంటలకు 7కి.మీ. దూరంలోని పెదపరిమికి చేరుకుంది. అక్కడ మధ్యాహ్న భోజనాల అనంతరం 2.45కి యాత్ర తిరిగి ప్రారంభమైంది. పెదపరిమి పొలిమేర దాటాక వర్షం మొదలైనా లెక్క చేయకుండా, దాదాపు కిలోమీటరు దూరం తడుస్తూనే నడిచారు. సాయంత్రం 5.20 గంటలకు తాడికొండ చేరుకున్నారు. సోమవారం రాత్రి అక్కడే బస చేశారు. పాదయాత్ర వివిధ గ్రామాల్లోకి ప్రవేశించినప్పుడు అక్కడి ప్రజలు నీరాజనాలు పలికారు. కొబ్బరికాయలు కొట్టి, హారతులిచ్చి స్వాగతం పలికారు. పాదయాత్ర సందర్భంగా ఎక్కడా ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా రైతులే వాలంటీర్లుగా వ్యవహరించారు. రోడ్డుకు ఒక పక్కనే క్రమపద్ధతిలో నడిచేలా తాడు పట్టుకుని నియంత్రించారు. అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్‌ శివారెడ్డి, కో కన్వీనర్‌ గద్దె తిరుపతిరావు తదితరులు దగ్గరుండి ఏర్పాట్లు చేశారు.

ఇదీ చదవండి :

AMARAVATHI PADAYATHRA : ఉధృతంగా అమరావతి మహాపాదయాత్ర.. అడుగడుగునా జన నీరాజనం

Last Updated : Nov 2, 2021, 5:11 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.