కరోనాను పారదోలేందుకు దీపాలు వెలిగించాలన్న ప్రధాని పిలుపు మేరకు... రాజధాని గ్రామ రైతులు ప్రమిదల్లో జ్యోతులు వెలిగించారు. కరోనాను తరిమేద్దాం... అమరావతిని సాదిద్ధాం అంటూ నినాదాలు చేశారు. తాడేపల్లి, తుళ్లూరు, మంగళగిరి మండలాల్లోని రాజధాని గ్రామాల వీధుల్లో మహిళలు దీపాలు, కాగడాలు వెలిగించారు. మందడంలో ఆంధ్రప్రదేశ్ మ్యాప్‌ను నవ ధాన్యాలతో అలంకరించారు. కృష్ణాయపాలెంలో రైతులు కాగడాలు వెలిగించి అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు. వెంకటపాలెంలో మహిళలు సామాజిక దూరం పాటించి ప్రదర్శన చేశారు. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: