పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ అమరావతి రైతులు చేస్తున్న ధర్నాలు 213వ రోజుకు చేరుకున్నాయి. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెదపరిమి, మందడం, రాయపూడి, మల్కాపురం, దొండపాడు, మంగళగిరి మండలం నీరుకొండ, కృష్ణాయపాలెంలో రైతులు, మహిళలు, చిన్నారులు ధర్నాలో పాల్గొన్నారు. ప్రాణాలర్పించైనా అమరావతిని సాధిస్తామంటూ మహిళలు నినాదాలు చేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే ధర్నాలో పాల్గొన్నారు. ఈ సుదీర్ఘ ఉద్యమంలో తమకు అండగా నిలిచిన న్యాయస్థానాలకు పాదాభివందనాలు అంటూ నినదించారు. తమను న్యాయవ్యవస్థే కాపాడుతోందని రైతులు తెలియజేశారు.
ఇదీ చదవండి: సరస్వతీ నమస్తుభ్యం... ఆన్ లైన్ విద్యారంభం కరిష్యామి