ETV Bharat / state

అమరావతి ఉద్యమానికి ఏడాది.. రాయపూడిలో జనభేరి

రాజధాని గ్రామాల్లో అమరావతి ఆందోళనలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఉద్యమానికి ఏడాది పూర్తవుతున్నందు...రాయపూడిలో జనరణభేరి పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఐకాస ఏర్పాట్లు చేస్తోంది. 107 మంది రైతులు ప్రాణాలు కోల్పోయినా.... ప్రభుత్వం పట్టువీడడం లేదని ఆక్షేపించిన మహిళలు....సర్కారుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.

amaravathi capital farmers protest ongoing very powerful
ఉద్ధృతంగా సాగుతున్న అమరావతి ఉద్యమం
author img

By

Published : Dec 16, 2020, 9:04 PM IST

Updated : Dec 17, 2020, 12:35 AM IST

అమరావతి ఉద్యమానికి ఏడాది..

మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి రైతులు, మహిళలు చేస్తోన్న ఉద్యమం రోజురోజుకూ ఉద్ధృతమవుతోంది. నిరసన తీవ్రతను సర్కారుకు తెలియజెప్పేందుకు పెదపరిమిలో రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. ఏడాది కిందట ముఖ్యమంత్రి జగన్.... మూడు రాజధానుల ప్రకటనతో తమ గుండెల్లో గునపం దించారని వెంకటపాలెం ఎస్సీ ఐకాస నేతలు మండిపడ్డారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా...తుళ్లూరు వరకు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. కృష్ణాయపాలెంలో రైతులు, మహిళలు పాదయాత్ర నిర్వహించారు. ఎన్నికలకు ముందు... ఆ తర్వాత ముఖ్యమంత్రి జగన్ వ్యవహరించిన తీరుపై ఓ రైతు చేసిన స్కిట్ అందరినీ ఆలోచింపజేసింది.

గుంటూరు జిల్లా రాయపూడిలో జన రణభేరి పేరిట నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు ప్రజలంతా తరలిరావాలని ఐకాస నేతలు పిలుపునిచ్చారు. ఐదు కోట్ల ఆంధ్రుల కోసం భూములిచ్చిన తమను.... ఏడాది నుంచి సర్కారు వేధిస్తోందని మండిపడ్డారు. గురువారం జరిగే సభలో పోరాట ప్రణాళికను వెల్లడిస్తామని నేతలు తెలిపారు.

అమరావతి ఐకాస బహిరంగ సభకు రాజకీయ పార్టీల నేతలు మద్దతు ప్రకటించారు. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు జనరణభేరి ప్రాంతాన్ని పరిశీలించారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని సీఎం సొంత నియోజకవర్గ ప్రజలే స్వాగతించడం లేదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు. రైతులకు మద్దతుగా కాంగ్రెస్‌ పోరాడుతుందన్నారు.

తెలుగునాడు కార్మిక సంఘం ఆధ్వర్యంలో... విజయవాడలోని ధర్నాచౌక్​లో అమరావతి రైతులకు మద్దతుగా ఆందోళనలు చేశారు. బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలంతా తరలిరావాలని నేతలు పిలుపునిచ్చారు.

ఇదీచ దవండి: దేశవ్యాప్తంగా హైకోర్టు సీజేలు, జడ్జీలు బదిలీ

Last Updated : Dec 17, 2020, 12:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.