ETV Bharat / state

24 గంటల నిరశన దీక్ష విరమించిన రైతుల కుటుంబాలు - అమరావతి రైతుల అరెస్టుపై ధర్నాలు

అరెస్టైన అమరావతి రైతులను విడుదల చేయాలని వారి కుటుంబ సభ్యులు చేపట్టిన 24 గంటాల నిరశన దీక్ష ముగించారు. రాజధాని ఐక్యకార్యాచరణ సమితి నేతలు, మహిళ ఐకాస నేతలు వారికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.

amaravathi arrested farmer families  protest
24 గంటల నిరశన దీక్ష విరమించిన అరెస్టైన రైతుల కుటుంబాలు
author img

By

Published : Nov 3, 2020, 11:41 AM IST

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై అరెస్టైన అమరావతి రైతులను విడుదల చేయాలని కోరుతూ కృష్ణాయపాలెంలో రైతుల కుటుంబ సభ్యులు చేసిన 24 గంటల నిరశన దీక్ష ముగిసింది. రాజధాని ఐక్యకార్యాచరణ సమితి నేతలు, మహిళ ఐకాస నేతలు పువ్వాడ సుధాకర్, రాయపాటి శైలజ, గద్దె అనురాధ నిరశన చేస్తున్న వారికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేశారు.

ఎస్సీలపై అట్రాసిటీ కేసు నమోదు చేసిన వైకాపా ప్రభుత్వం ఎంతోకాలం మనుగడలో ఉండబోదని నేతలు అన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఎస్సీలకు చేసిన ద్రోహాన్ని 13 జిల్లాల వారికి తెలియజేస్తామని వెల్లడించారు. ఎస్సీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ వచ్చే ఎన్నికల్లో వారి ఓట్లతోనే ఓటమి పాలు అవుతారని నేతలు అన్నారు.

ఇదీ చదవండి:

భయం భయంగా బడికి.. తొలి రోజు 45 శాతం లోపే హాజరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.