ETV Bharat / state

'సామూహిక ఆత్మహత్యలకు అనుమతి ఇవ్వండి'

మంత్రి మండలి సమావేశం కారణంగా అమరావతిలోని మందడంలో రైతులు, మహిళల నిరసనను పోలీసులు అడ్డుకున్నారు. వారిని దీక్షా శిబిరాల నుంచి పంపించేశారు. దీనిపై అమరావతి ప్రజలు మండిపడ్డారు. ముఖ్యమంత్రి సచివాలయానికి వచ్చే ప్రతి సారి తమను ఇబ్బందులకు గురి చేయడం సరికాదని మహిళలు ఆక్షేపించారు.

amaravati farmers
amaravati farmers
author img

By

Published : Sep 3, 2020, 3:24 PM IST

సామూహిక ఆత్మహత్యలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని రాజధాని రైతులు కోరారు. మందడంలో రైతులు, మహిళలు 261 రోజు నిరసనకు దిగగా... మంత్రి మండలి సమావేశం జరుగుతున్నందున వారిని పోలీసులు దీక్షా శిబిరాల నుంచి బలవంతంగా బయటకు పంపించారు. పోలీసుల తీరుపై మహిళలు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సచివాలయానికి వచ్చే ప్రతి సారి తమను ఇలా ఇబ్బందులకు గురి చేయడం సరికాదని మహిళలు ఆక్షేపించారు. ప్రైవేటు స్థలంలో నిరసన తెలిపే హక్కు లేదా అని ప్రశ్నించారు.

మరోవైపు రాజధానిలో దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని రాష్ట్రమంతా తెలియజేసేందుకు దళిత ఐకాస నేతలు పర్యటన ప్రారంభించారు. అసైన్డ్ రైతులకు ఇంతవరకు కౌలు చెల్లించలేదని, ప్రభుత్వం ఇస్తామన్న 5000 పెన్షన్ ఇంతవరకు తమ ఖాతాలో పడలేదని ఐకాస నేతలు చెప్పారు.

ఇదీ చదవండి

ఏపీ సర్కారుకు సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.