ప్రస్తుత రాజధాని అమరావతి, మంగళగిరి మండలంలోని కొన్ని గ్రామాలు రాజధానిలో ఉన్నాయని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. తుళ్లూరు మండలంలోని గ్రామాలు ముంపులో ఉన్నాయని....అందుకే మంగళగిరిని రాజధాని చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంతం భవనాలు కట్టుకోవడానికి అనువుగా ఉంటుందన్నారు. రాజధాని విషయంలో రైతులెవ్వరూ అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. త్వరలోనే రైతులందరికీ కౌలు డబ్బులు తమ ఖాతాలలో వేస్తున్నట్లు వెల్లడించారు.
ఇది చూడండి: రాజధాని అమరావతిపై నీ వైఖరేంటి జగన్ ?