కరోనా బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయాలని... అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ తెదేపా నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ గుంటూరులో 12 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. ఆయనకు సంఘీభావంగా తెదేపా నేతలు దీక్షలో పాల్గొన్నారు. లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రతి కుటుంబానికి 5 వేల రూపాయలు అందించాలన్నారు. కరోనాతో మృతి చెందిన వ్యక్తుల కుటుంబానికి 25 లక్షల రూపాయలు పరిహారం ప్రకటించాలని చెప్పారు. తమ డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేయడానికే 12 గంటల దీక్ష చేపట్టినట్లు ఆలపాటి తెలిపారు.
ఇదీ చదవండి: