గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి ఎయిమ్స్‌కు వెళ్లే ప్రధాన రహదారిలో నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్‌ను ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. ఆస్పత్రి సంచాలకులు డాక్టర్ ముఖేష్ త్రిపాఠితో కలిసి ప్రారంభించారు. గత వారం లైట్లను ఏర్పాటు చేయాల్సిందిగా ఏయిమ్స్ అధికారులు ఎమ్మెల్యేను కోరారు. దానిపై స్పందించిన ఆళ్ల.. యుద్ధ ప్రాతిపదికన లైట్లను ఏర్పాటు చేశారు.
ఎయిమ్స్‌లో వైద్య సేవలు త్వరలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మౌలిక వసతులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
ఇదీ చదవండి: