ETV Bharat / state

నరసరావుపేటలో పోలింగ్ కేంద్రాల వద్ద తెదేపా శ్రేణుల ఆందోళన - గుంటూరులో పరిషత్​ ఎన్నికల వార్తలు

గుంటూరు జిల్లా నరసరావుపేట మండలంలో పోలింగ్​ కేంద్రాల వద్ద తెదేపా శ్రేణులు ఆందోళనకు దిగాయి. ప్రభుత్వాధికారులు వైకాపా నాయకులకు సహకరిస్తున్నారని ఆరోపించారు.

agitation of TDP activists
రోడ్డుపై బైఠాయించి తెదేపా శ్రేణుల ఆందోళన
author img

By

Published : Apr 8, 2021, 1:56 PM IST

గుంటూరు జిల్లా నరసరావుపేట మండలంలోని పోలింగ్​ కేంద్రాల వద్ద తెదేపా శ్రేణులు ఆందోళన చేశారు. గోనెపూడి, పాలపాడు గ్రామాల్లో తెదేపా ఏజెంట్లను పోలింగ్​ కేంద్రాల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా కేంద్రాల వద్ద బైఠాయించారు. పోలీసులు వారికి సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. ప్రభుత్వ అధికారులు, పోలీసులు వైకాపా నాయకులకే సహకరిస్తున్నారని పార్టీ నేతలు, కార్యకర్తలు ఆరోపించారు.

ఇదీ చదవండి: పరిషత్ పోరు: ఉదయం 11 గంటలకు 21.65 శాతం పోలింగ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.