ఆంధ్ర ఇవాంజికల్ లూథరన్ చర్చి (ఏఈఎల్సీ) ఆస్తులను అమ్మటం సరికాదని... ఆ చర్చ్ సంఘం నూతన అధ్యక్షడు సీహెచ్ ఏలియా అన్నారు. గుంటూరు నార్త్ ప్యారిస్ చర్చిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 170 ఏళ్ల చరిత్ర కలిగిన ఏఈఎల్సీ ప్రతిష్టతను కొందరు స్వార్ధపరులు దెబ్బతీస్తున్నారని ఆరోపించారు.
ఏఈఎల్సీకి చెందిన వేల కోట్ల రూపాయలు అన్యాక్రాంతం అయ్యాయని విమర్ళించారు. ఇప్పటి వరకు ఆక్రమించుకున్న భూములను తిరిగి ఇచ్చేయాలని సంఘం ప్రతినిధి ఎస్.ఎస్. విక్రాంత్ అన్నారు. లేని పక్షంలో దానికి కారణమైన పరదేశిబాబు పైన చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇదీ చదవండి: