పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసినట్లు న్యాయవాది లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.
రాజధానిని మార్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు న్యాయస్థానం ముందు నిలబడే అవకాశాలు లేవన్నారు. హైకోర్టులో జరిగే విచారణలో దేశంలోనే అత్యున్నతమైన న్యాయవాదులు రైతుల తరఫున వాదిస్తున్నట్లు చెప్పారు. అంతిమ విజయం రైతులదే అని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:
రాజధానిగా అమరావతివైపే ప్రజల మొగ్గు... వెబ్‌సైట్ పోలింగ్‌లో 93 శాతం మంది ఓటు