కృష్ణా జిల్లా యువకుడు పెడ్డాడి శ్రీనివాసరావు ఆత్మహత్య ఘటనపై విచారణ జరుగుతోంది. పోలీసులు తప్పు చేసినట్లు తేలితే బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అదనపు ఎస్పీ కె.చక్రవర్తి వెల్లడించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయన బాపట్ల వచ్చారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక వెదుళ్లపల్లి పోలీసులను విచారణ చేస్తామన్నారు. యువకుని సెల్ఫీ వీడియో.... ఇతర అంశాలపై సమగ్ర దర్యాప్తు చేస్తామని చెప్పారు.
లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు శ్రీనివాసరావు ద్విచక్రవాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారన్నారు. అతడిని ఎవరూ కొట్టలేదని, మధ్యాహ్నం... సాయంత్రం పోలీసులే భోజనం అందించారని చెప్పారు. మానవతా దృక్పథంతో స్వస్థలానికి పంపేందుకు భీమవరం వెళ్తున్న కంటైనర్‌లో ఎక్కించి పంపించారని తెలిపారు. శ్రీనివాసరావు బలవన్మరణానికి పాల్పడటం విచారకరమన్నారు.
ఇదీ చూడండి: