ETV Bharat / state

సీఎం జగన్.. తండ్రిని మించిపోయేలా ఉన్నారు: అలీ

author img

By

Published : Mar 28, 2021, 6:58 AM IST

సంక్షేమ పథకాల అమలులో.. సీఎం జగన్‌...తన తండ్రి రాజశేఖర్‌రెడ్డిని మించిపోయాలా ఉన్నారని సినీనటుడు అలీ అన్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో పురపాలక ఎన్నికల విజయోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చిలకలూరిపేట పురపాలక ఛైర్మన్ పదవికి ఓ సాధారణ కార్యకర్తగా ఉన్న షేక్‌ రఫానిని ఎన్నుకున్నారంటూ.. హర్షం వ్యక్తం చేశారు.

actor ali participating in the municipal election victory ceremony at chilakaluripeta
చిలకలూరిపేటలో పురపాలక ఎన్నికల విజయోత్సవ కార్యక్రమంలో పాల్గన్న నటుడు అలీ

వైకాపా సంక్షేమ పథకాలపై ప్రశంసలు కురిపించిన నటుడు అలీ

గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణం కళామందిర్ సెంటర్లో శనివారం రాత్రి మున్సిపల్ ఎన్నికల విజయోత్సవ సభను నిర్వహించారు. సినీ నటుడు అలీ, ఎమ్మెల్యే విడదల రజిని, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి, గుంటూరు నగర మేయర్ మనోహర్ నాయుడు, వైకాపా అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేద ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు తగ్గకుండా అంతకుమించి చేయాలనే తపనతో ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని సినీ నటుడు అలీ కొనియాడారు. చిన్న కార్యకర్తగా ఉన్న షేక్ రఫానికి.. పురపాలక ఛైర్మన్​గా అవకాశం కల్పించిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. తాను ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన తరువాతే తిరిగి ప్రజలను ఓట్లు అడుగుతానని ఎమ్మెల్యే విడదల రజిని తెలిపారు.

ఇదీ చదవండి:

అసైన్డ్ భూములు అమ్ముకున్నారన్న వార్తలు అవాస్తవం: రైతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.