ETV Bharat / state

TRS MLAs: ఎమ్మెల్యేలకు ఎర కేసు నిందితులకు 14 రోజుల రిమాండ్

TRS MLAs: ఎమ్మెల్యేలకు ఎర కేసులోని ముగ్గురు నిందితులను పోలీసులు అ.ని.శా కోర్టుకు తరలించారు. ముగ్గురు నిందితులకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్​ విధించారు. హైకోర్టు ఆదేశాలు ఉండటంతో పోలీసుల కస్టడీ పిటిషన్​ను న్యాయమూర్తి తిరస్కరించారు.

TRS MLAs
ఎమ్మెల్యేలకు ఎర కేసు
author img

By

Published : Oct 29, 2022, 10:53 PM IST

TRS MLAs: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని మొయినాబాద్​ పీఎస్​కు తరలించారు. రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజీ స్వామిజీల నుంచి పోలీసులు మరోసారి వాంగ్మూలం సేకరించారు. ముగ్గురికి పోలీస్​స్టేషన్​లోనే మొయినాబాద్ పీహెచ్​సీ వైద్యుడు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారిని అ.ని.శా జడ్జి ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి ముగ్గురు నిందితులకు 14 రోజుల రిమాండ్​ విధించారు. అనంతరం నిందితులను చంచల్​గూడ జైలుకు తరలించారు. హైకోర్టు ఆదేశాలు ఉండటంతో పోలీసుల కస్టడీ పిటిషన్​ను న్యాయమూర్తి తిరస్కరించారు.

తెరాసను వీడి భాజపాలో చేరితే రూ.100 కోట్లతో పాటు.. సివిల్ కాంట్రాక్టు పనులు ఇస్తామని ప్రలోభపెట్టారని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురిపై మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 27న న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా.. రిమాండ్ చేయడానికి తిరస్కరించారు. నిందితులను అరెస్ట్ చేయడాని కంటే ముందు 41 సీఆర్పీసీ ఇవ్వలేదని.. అ.ని.శా కోర్టు న్యాయమూర్తి పోలీసులను తప్పుపట్టారు. దీంతో పోలీసులు ముగ్గురు నిందితులకు 41 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చి ఇంటికి పంపించారు.

సైబరాబాద్ పోలీసులు హైకోర్టులో నిన్న అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. అ.ని.శా ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రిమాండ్​ను తిరస్కరించడాన్ని సవాల్ చేశారు. నిందితులు విచారణకు సహకరించకుండా ఉండటం.. చేసిన నేరాన్ని బట్టి ఏడేళ్ల వరకు శిక్ష పడుతుందని దర్యాప్తు అధికారి భావించినప్పుడు నోటీసులు ఇవ్వాల్సిన పని లేదని పోలీసుల తరఫున అడ్వకేట్ జనరల్ వాదించారు. ఈ వాదనతో ఏకీభవించిన హైకోర్టు బెంచ్.. ముగ్గురు నిందితులు వెంటనే సైబరాబాద్ సీపీ ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. ఆ తర్వాత అ.ని.శా కోర్టులో హాజరుపర్చి న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్​కు తరలించాలని ఆదేశించింది. దీని ప్రకారం సైబరాబాద్ పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. అనిశా ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా.. 14 రోజుల రిమాండ్​ విధించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.