ACB raids across the state: రాష్ట్ర వ్యాప్తంగా పలువురు అధికారుల నివాసాలు, కార్యాలయాలపై ఏసీబీ.. దాడులు జరుపుతోంది. ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారనే ఆరోపణలతో తనిఖీలు నిర్వహిస్తోంది. సోదాల్లో అవినీతి అధికారుల బండారం బయటపడింది. అక్రమార్జన చిట్టాను ఏసీబీ అధికారులు బయటపెట్టారు. కర్నూలు అసిస్టెంట్ రిజిస్ట్రార్ సుజాతను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు.
సుజాత ఆస్తులు.. అమెకు సంబంధించి కర్నూలులో 5 ఇళ్లు, సుంకేసుల గ్రామంలో 2.50 ఎకరాల వ్యవసాయ భూమి, శివారు ప్రాంతంలో ఎనిమిది ఇళ్ల స్థలాలు, 40 తులాల బంగారం,కారు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, బంగారం మరియు గృహోపకరణాలు, 8,21,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ పటమట సబ్ రిజిస్ర్టార్ అర్జ రాఘవరావు భార్య పేరుతో రామవరపాడు వద్ద జి ప్లస్ డూప్లెక్స్ ఇల్లు, గుండాల , విజయవాడ, అవనిగడ్డలో కుమారుల పేర్లతో ఐదు ఫ్లాట్లు, ఖాళీ స్తలం ఉన్నట్లు గుర్తించారు. ఖరీదైన ఫోక్స్ వాగన్ పోలో కార్, స్కోడా కార్, రెండు థార్ జీప్‌లు, రెండు ద్విచక్ర వాహనాలు, 1580 గ్రాముల బంగారు ఆభరణాలు, 12,71,950 లక్షల నగదు, 18 లక్షల విలువ చేసే గృహోపకరణలు, 7 లక్షల విలువ గలిగిన ప్రామిసరి పాత్రలు, మరియు ఇతర పత్రాలు ఉన్నట్లు గుర్తించారు.
వాసా నగేష్‌పై.. విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయం సూపరిండెంట్‌గా పనిచేస్తోన్న వాసా నగేష్ ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఫిర్యాదులపై ఉదయం నుంచి అవినీతి నిరోధకశాఖ ప్రత్యేక బృందాలు తనిఖీలు చేపట్టాయి. విజయవాడ కుమ్మరిపాలెంలోని లోటస్ లెజెండ్ అపార్ట్‌మెంట్లోని నగేష్ నివాసంతో పాటు- ఆరు చోట్ల సోదాలు జరిపారు. గతంలో నగేష్ పని చేసిన ప్రాంతాల్లోను ప్రత్యేక బృందాలు స్తిర, చరాస్తులకు చెందిన వివరాలపై ఆరా తీశారు. భీమడోలు, ద్వారకా తిరుమల, నిడదవోలుతో పాటు దుర్గా దేవాలయంలోని ఏఓ కార్యాలయంలోనూ.. నగేష్ కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో సోదాలు చేశారు. గతంలో నగేష్‌పై పలు ఆరోపణలు వచ్చి అంతర్గత విచారణ కూడా జరిగింది. ఆ వివరాలను కూడా పరిగణనలోకి తీసుకుని అనిశా బృందాలు ప్రస్తుతం తమ సోదాలు చేస్తున్నట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
నగేష్ ఆస్తులు.. ఏకకాలంలో ద్వారకాతిరుమల, విజయవాడ, నిడదవోలులో సోదాలు చేపట్టారు. ద్వారకాతిరుమలలో నగేష్ అపార్ట్మెంలో ముఖ్యమైన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. అయితే నగేష్ గతంలో ద్వారకాతిరుమల ఆలయంలో చాలాకాలం పలు హోదాల్లో ఉద్యోగిగా పని చేశారు. 1.17 లక్షల నగదు, 209, 10 గ్రాముల బంగారం, ద్వారకా తిరుమలలో G+4 ఇల్లు, తాడేపల్లిగూడెంలో ఇల్లు, జంగారెడ్డిగూడెంలో ఇల్లు, నిడదవోలులో ఫ్లాట్, ఇల్లు, సుజుకి వ్యాగన్ కారు, రెండు యాక్టివా స్కూటర్లు ఉన్నట్లు గుర్తించారు. ద్వారకాతిరుమల యూనియన్ బ్యాంక్ బ్రాంచ్లో ఇంకా ఒక లాకర్ తనిఖీ చేయలేదని తెలిపారు. ఇరువురి అధికారుల ఇళ్లల్లో తనికీలు జరుగుతున్నాయి.
ఇవీ చదవండి: