ETV Bharat / state

అదనపు కట్నం కావాలన్నాడు.. అమ్మాయి పుట్టిందని వేధించాడు!

ఆమెది... మధ్య తరగతి కుటుంబం. విద్యావంతుడు భర్తగా వచ్చాడని సంబరపడింది. కష్టాలు తీరాయని సంతోషించింది. అతడు చదువు నేర్చాడు... కానీ సంస్కారం మరిచాడు. అదనపు కట్నం కావాలని కొంత కాలం, అమ్మాయి పుట్టిందని మరికొంత కాలం వేధించాడు. భర్తలో మార్పు కోసం ఆ ఇల్లాలు ప్రయత్నంచింది. చివరికి అతనిలో మార్పు రాక.. ఎదిరించే శక్తి లేక న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌ గడప తొక్కింది.

harassment case
ఆడపిల్ల పుట్టిందని గెంటేశాడు
author img

By

Published : Dec 1, 2020, 12:55 PM IST

గుంటూర జిల్లా రాజుపాలేనికి చెందిన ఓ గృహిణి... భర్త వేధింపులు భరించలేక పోలీసులను ఆశ్రయించింది. అదనపు కట్నం కావాలని అత్తింటి వాళ్లు ఇబ్బంది పెడుతున్నారని.. అమ్మాయి పుట్టిందని ఇంటి నుంచి పంపించేశారని ఫిర్యాదు చేసింది.

నేను ఇంటర్‌ వరకు చదువుకున్నా. మా తల్లిదండ్రులు రెండేళ్ల క్రితం సత్తెనపల్లికి చెందిన వ్యవసాయ పరిశోధకుడిగా పనిచేస్తున్న... ఓ ప్రయివేటు ఉద్యోగికి కట్నకానుకలు ఇచ్చి వివాహం జరిపించారు. చెడు వ్యసనాలకు బానిసైన నా భర్త అధిక కట్నం కోసం వేధించడం ప్రారంభించాడు. ఆయన కుటుంబ సభ్యులు సైతం వేధించారు. కొద్ది రోజులకు ఆడపిల్ల పుట్టింది. అది నచ్చని మా వాళ్లు మరింతగా బాధపెట్టటం ఆరంభించారు. ఎలాగైనా నన్ను, నా కుమార్తెను అడ్డు తొలగించుకోవాలని విషం పెట్టాలని కుట్ర పన్నారు. ఈ విషయం మా తల్లిదండ్రులకు చెప్పాను. వారు మాట్లాడడానికి వెళితే వారిపైనా దాడిచేసి గెంటేశారు. నా భర్త, అత్తింటి వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించి వారి బారి నుంచి నాకు, నా బిడ్డకు రక్షణ కల్పించండి. నా భర్త, అత్తింటి వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించి , నాకు న్యాయం చేయాలని స్పందనలో ఎస్పీకి ఫిర్యాదు చేశాను. ఎస్పీ స్పందించారు. వెంటనే విచారించి చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులను ఆదేశించారు.

: బాధితురాలు

ఇదీ చదవండీ...వరద తగ్గుముఖం పట్టినా తీరని కష్టాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.