పర్యటక ప్రాంతమైన సూర్యలంక తీరంలో విషాదం చోటు చేసుకుంది. కొవిడ్ కారణంగా ఆరు నెలలుగా పర్యటకులను అనుమతించటం లేదు. అయినా కొందరు సూర్యలంక తీరానికి వచ్చి వెళుతున్నారు.
ఆదివారం సెలవు దినం కావడంతో గుంటూరు సంగడిగుంటకు చెందిన 11 మంది యువకులు తెల్లవారుజామున ద్విచక్రవాహనాలపై బయలుదేరి బాపట్ల సూర్యలంక తీరానికి వెళ్లారు. వీరంతా తీరంలో స్నానం చేస్తుండగా అలల తాకిడికి ప్రమాదవశాత్తు ఇద్దరు గల్లంతయ్యారు. స్థానిక జాలర్లు ఒకరిని కాపాడి వైద్యశాలకు తరలించారు. మరొకరి ఆచూకీ లభ్యం కాకపోవడంతో తోటి స్నేహితులు ఆందోళనలో ఉన్నారు.
ఇదీ చదవండి: పర్యాటక కేంద్రాల్లో పెరుగుతున్న సందడి