ETV Bharat / state

మాటల్లో పెట్టి... గల్లా పెట్టెనే దోచుకెళ్లాడు..! - a person theft money box in a shop at gutur dst

కిరాణా షాపు యజమానిని మాటల్లో పెట్టి ఓ యువకుడు మరొకరి సహాయంతో ఏకంగా గల్లాపెట్టెనే ఎత్తుకెళ్లాడు. అయితే మరో ఇంట్లో వీరు దొంగతనం చేస్తుండగా పట్టుకున్న స్థానికులు వారిని పోలీసులకు అప్పగించారు. గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో జరిగిన ఘటన వివరాలివి..!

a person theft money box in a shop at gutur dst
సీసీ కెమెరాల్లో రికార్డయిన దొంగతనం దృశ్యాలు
author img

By

Published : Mar 29, 2020, 12:16 PM IST

సీసీ కెమేరాల్లో రికార్డయిన దొంగతనం దృశ్యాలు

గుంటూరు జిల్లాలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. తెనాలి మండలం బుర్రిపాలెంలోని ఓ దుకాణంలో యజమానిని మాటల్లో పెట్టిన యువకుడు.. మరో వ్యక్తి సహాయంతో గల్లాపెట్టె తీసుకుని బైక్​పై పరారయ్యాడు. యువకుడు గల్లాపెట్టె దొంగలించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వారిద్దరూ కలిసి మరో ఇంట్లో దొంగతనం చేసేందుకు ప్రయత్నించిన సమయంలో స్థానికులు పట్టుకుని.. పోలీసులకు అప్పగించారు. వీరిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:

'కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.