గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం పాకాలపాడు గ్రామానికి చెందిన కొలకలూరి అచయ్య కుటుంబం కొన్నాళ్లుగా పిరంగిపురంలో ఉంటున్నారు. దుస్తులు ఆరవేసేందుకు బయట ఉన్న విద్యుత్ స్తంభం నుంచి.. ఇంటి లోపలికి తాడు కట్టాడు.
ఈ క్రమంలో దండెంపై బట్టలు ఆరవేస్తుండగా.. విద్యుత్ ప్రవహించి షాక్ కొట్టింది. వెంటనే కుటుంబసభ్యులు ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు తెలిపారు. మృతుడికి భార్య..ఇద్దరు మగ పిల్లలు,ఒక ఆడ పిల్ల ఉన్నారు.
ఇదీ చదవండి: