ETV Bharat / state

పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని ఆశ చూపి... చివరకు నట్టేట ముంచే.. - గుంటూరు జిల్లా తాజా వార్తలు

ప్రభుత్వ పనులు కాంట్రాక్టు పద్ధతిలో నిర్వహించే కంపెనీలు ఉన్నాయని నమ్మించి... ఒక వ్యక్తి నుంచి రూ.2 కోట్లు మేర కాజేసిన ఘటన గుంటూరులో జరిగింది. ఫోర్జరీ పత్రాలు చూపించి...అతని కంపెనీలో పెట్టుబడులు పెడితే లాభాలు బాగా వస్తాయని మాయమాటలు చెప్పి... భారీ మెుత్తంలో నగదును దోచుకున్నాడు. డబ్బు ఇవ్వమని అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితుడు పోలీసుల్ని ఆశ్రయించాడు.

పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని ఆశ చూపి
A Man Was Cheated By Cheater
author img

By

Published : Dec 22, 2020, 6:57 PM IST

నకిలీ పత్రాలు చూపించి ఒక వ్యక్తిని మోసం చేసిన ఘటన గుంటూరులో జరిగింది. ప్రభుత్వ పనులు కాంట్రాక్టు పద్ధతిలో తమ కంపెనీలు నిర్వహిస్తున్నాయన్న... ఓ మోసగాడి మాటలు నమ్మి రూ. రెండు కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టి మోసపోయిన బాధితుడు.. జిల్లా అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. నగదును తిరిగి ఇవ్వాలని అడిగితే... తనను బెదిరిస్తున్నాడని బాధితుడు తెలిపాడు.

వివరాలు తెలుపుతున్న బాధితుడు

హైదరాబాద్ లోని అమీర్ పేటకు చెందిన తోట లక్ష్మీ శ్రీనివాస్ ఆర్కిటెక్ ఇంజినీర్​గా ఉద్యోగం చేస్తున్నాడు. గుంటూరులోని కన్నవారితోటకు చెందిన తిరుమలశెట్టి రాఘవ, చార్టెడ్ అకౌంటెంట్ గా... శ్రీనివాస్​కు రెండు ఏళ్ల క్రితం పరిచయం అయ్యాడు. తాను నాలుగు కంపెనీలు నడుపుతున్నాని... వాటికి ప్రభుత్వ గుర్తింపు ఉందని నమ్మించాడు. ప్రభుత్వానికి సంబంధించిన అన్ని కాంట్రాక్టు పనులు తమకే వస్తాయని ఫోర్జరీ పత్రాలూ చూపించాడు. ఆ కంపెనీలో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయని మాయమాటలు చెప్పాడు. అతని మాటలు నమ్మిన బాధితుడు... విడతల వారిగా కంపెనీల్లో రూ.రెండు కోట్ల వరకు పెట్టుబడి పెట్టాడు.

నెలలు గడుస్తున్నా డబ్బులు విషయం అడుగుతుంటే బిల్లులు పాస్ అవ్వలేదంటూ తప్పించుకుంటున్నాడని బాధితుడు పేర్కొన్నాడు. నగదు ఇవ్వడం లేదని గట్టిగా అడిగితే అతని బాబాయ్ ఏసీబీ సీఐ అని బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపాడు. తనని మోసగించి బెదిరిస్తున్న రాఘవపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితుడు పోలీసుల్ని ఆశ్రయించాడు.

ఇదీ చదవండి:

మైక్రోఫైనాన్స్‌ యాప్​ల వేధింపులు.. వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.