సంక్రాంతికి కోడి పందాలు నిర్వహించకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నా... వాటికి అవసరమైన బరుల ఏర్పాట్లు, కత్తుల వ్యాపారం జోరుగా సాగుతోంది. కోడి కత్తులు విక్రయిస్తున్న ఓ వ్యాపారిని పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా నకరికల్లుకు చెందిన హనుమంతాచారి అనే వ్యక్తి.. కత్తులు తయారు చేసి అమ్ముతున్నాడనే సమాచారంతో తనిఖీలు నిర్వహించారు. . అతని వద్ద నుంచి 350 కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశారు.
పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని నకరికల్లు ఎస్సై ఉదయ బాబు తెలిపారు. కోడి పందాలు, జూదాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: ఆర్టీసీ ఎండీగా ఆర్పీ ఠాకూర్ నియామకం