గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం పేరూరుపాడు గ్రామానికి చెందిన ఆళ్ల రమణారెడ్డి.. గత నెలలో విద్యుదాఘాతానికి గురై కొత్తపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు. అనారోగ్య సమస్యలతో.. డయాలసిస్ చేయించుకునే నిమిత్తం అతన్ని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ రమణారెడ్డి మృతిచెందాడు.
వైద్యుల నిర్లక్ష్యంతోనే రమణారెడ్డి చనిపోయాడని ఆరోపిస్తూ.. ఆసుపత్రి ఎదుట మృతిని కుటుంబ సభ్యులు నిరసన చేపట్టారు. బాధిత కుటుంబానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న కొత్తపేట సీఐ రాజశేఖర్ రెడ్డి.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. వాళ్లతో మాట్లాడి నిరసనను విరమింపచేశారు.
ఇదీ చూడండి:
బిడ్డకు జన్మనిచ్చి అనారోగ్యంతో ఆవు మృతి.. దూడకు తల్లి అయిన బాలమ్మ