ETV Bharat / state

ఉద్యోగం రాలేదని.. పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య ! - ఉద్యోగం రాలేదని మస్తాపంలో ఓ వ్యక్తి ఆత్మహత్య

ఉద్యోగం రాలేదని మనస్తాపం చెందిన ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన గుంటూరు జిల్లా తాడికొండ మండలం ఫణిదరం గ్రామంలో జరిగింది.

a man committed at phanidaram
పురుగుల మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్య !
author img

By

Published : Nov 17, 2020, 4:51 AM IST

గుంటూరు జిల్లా తాడికొండ మండలం ఫణిదరం గ్రామంలో.. ఉద్యోగం రాలేదని మనస్తాపంతో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన నంగనం సముద్రబాబు(36) డిగ్రీ వరకు చదివాడు. ఉద్యోగం రాకపోవడం వల్ల వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నాడు. తనకు ఎక్కడా ఉద్యోగం రాలేదని తరచూ భార్యకు చెబుతూ బాధపడేవాడని మృతుని సన్నిహితులు చెప్పారు. ఈ క్రమంలో శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. ఆ విషయం తన తండ్రికి చెప్పాడు. వెంటనే బంధువుల సహాయంతో గుంటూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతున్న అతను ఆదివారం రాత్రి మృతి చెందాడు.

మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త మరణంతో శ్రావణి కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు తాడికొండ ఎస్సై రాజశేఖర్ తెలిపారు.

ఇదీ చూడండి:

"ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. మోసం చేశాడు"

Conclusion:7702888840

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.