Sucide in secunderabad railway station: వివాహేతర సంబంధాలు.. సంతోషంగా ఉన్న కుటుంబాన్ని తలకిందులు చేస్తున్నాయి. ఎంతో నమ్మకం పెట్టుకొని.. తానే నా సర్వస్వం అనుకున్న వ్యక్తులు ఎందరో.. తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. నిత్యం నరకం చూస్తున్నారు. అటువంటి సమయాలలోనే కొంతమంది.. ధైర్యంగా ఉండి.. తనని కాదనుకొని వెళ్లిపోయిన వారికోసం కాకుండా.. తన కోసం బతుకుతున్న వారి కోసం జీవిస్తూ.. సంతోషంగా ఉంటున్నారు. కానీ మరికొంత మంది మాత్రం ఇవేవీ ఆలోచించకుండా.. క్షణికావేశంలో.. తమ ప్రాణాలను తీసుకుంటున్నారు. అలాంటి ఘటనే తాజాగా ఒకటి జరిగింది.
స్థానికంగా కూలీ పనిచేస్తూ తన భార్యా, ముగ్గురు పిల్లలతో జీవనం సాగిస్తూ ఉండేవాడు చత్తీస్‌ఘడ్‌కు చెందిన జైభజరంగ్ (32). కానీ అతని భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని.. తనని వదిలి వెళ్లిపోవడం తట్టుకోలేక పోయాడు. జీవితాంతం కలిసి ఉంటుందనుకున్న మనిషి.. తన జీవితంలో లేకపోవడంతో కుంగిపోయాడు. దీంతో గూడ్స్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
హైదరాబాద్‌కు వచ్చి ఉంటుందని భావించిన అతను మూడు రోజుల క్రితం నగరానికి వచ్చి బంధువులను కలిశాడు. ఆమె జాడ తెలియకపోవడంతో తిరిగి సొంతూరుకు వెళ్లేందుకు బంధువులతో కలిసి గురువారం రాత్రి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. వారు టికెట్ తెచ్చేందుకు వెళ్లగా రెండో నంబరు ప్లాట్‌ఫాం నుంచి బయల్దేరి వెళ్తున్న గూడ్స్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.
మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లుగా రైల్వే స్టేషన్ల్లోనే ఉన్న మృతుడి బంధువుల ద్వారా జీఆర్పీ పోలీసులు తెలుసుకున్నారు. మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు.
ఇవీ చదవండి: