చెడు వ్యసనాలకు అలవాటు పడిన నలుగురు యువకులు ఇళ్ల ముందు నిలిపిన వాహనాలనే టార్గెట్‌గా పెట్టుకుంటారు. రాత్రికి రాత్రే వాటిని ఎత్తుకెళ్లి అమ్మేస్తారు. అనంతరం వచ్చిన సొమ్ముతో జల్సాలు చేస్తారు. లాక్‌డౌన్‌తో ఉపాధిలేక బైక్‌లు, ఆటోలు చోరీ చేయడం ప్రారంభించారు. చివరకు చేబ్రోలు పోలీసులకు చిక్కిపోయారు. వారి నుంచి తొమ్మిది ద్విచక్ర వాహనాలు, ఏడు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.
ఎలా చిక్కారంటే..
ఈనెల 17వ తేదీన చేబ్రోలులో ఓ ఇంటి ముందు ఉంచిన టీవీఎస్ వాహనం దొంగతనానికి గురైంది. సదరు బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. వాహనం కోసం పట్టణంలో పోలీసులు గాలిస్తుండగా.. గుంటూరు జిల్లా మంగళ దాస్ నగర్‌కు చెందిన నాగేంద్రబాబు అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో తారసపడ్డాడు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా.. ఇంటి ముందు ఉంచిన వాహనాలను ఆటోలను చోరీ చేసి అమ్ముతున్నట్లు ఒప్పుకున్నాడు. నిందితుడు ఇచ్చిన సమాచారంతో మిగతా ముగ్గుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దొంగలించిన వాహనాల వివరాల ఆధారంగా వాటిని స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేశామని తెనాలి డీఎస్పీ ప్రశాంతి తెలిపారు. దొంగతనాలు చేసిన బైక్‌లను, ఆటోలను యజమానులకు అందజేయనున్నట్లు ఆమె వెల్లడించారు.
ఇదీ చదవండి:
TADEPALLI RAPE CASE: నేరం చేశాక పాడుబడిన ఇళ్లలోనే ఆ నిందితుడు!
'టీకా వేసుకోకపోతే భారత్‌కు వెళ్లండి.. లేకపోతే పందుల ఇంజక్షన్'