అమెరికా పంపిస్తానంటూ.. ఏకంగా ఏఎస్సై కుమారుడికే 13 లక్షల రూపాయలు... టోపీ పెట్టేశాడు ఓ ఘరానా మోసగాడు. ఈ ఘటన గుంటూరులో చోటుచేసుకుంది.
గుంటూరుకు చెందిన నా పేరు రవికుమార్. మా తండ్రి రత్తయ్య ఏఎస్సైగా పనిచేసి కాలం చేశారు. ఎంఎస్సీ చదువుకొని ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో హైదరాబాద్‌కు చెందిన శ్యాంసుందర్ పరిచయమయ్యాడు. తాను కన్సల్టెన్సీ నడుపుతున్నానని అమెరికా వెళ్లేందుకు గాను వీసాకు రూ.10 లక్షలు ఖర్చవుతుందన్నాడు. 2018లో మొదటి విడతగా రూ.3 లక్షల నగదు, కొద్ది రోజుల తర్వాత వీసా సిద్ధం చేస్తున్నానంటూ ఆన్‌లైన్ ద్వారా విడతల వారీగా రూ.10 లక్షలు తన ఖాతాలోకి జమ చేయించుకున్నాడు. డబ్బులు తీసుకున్నా వీసా ఇప్పించలేదు. తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగా. 2019 మే నెలలో రూ. 10 లక్షల చెక్కు ఇవ్వగా అది బౌన్స్ అయింది. ఈ విషయం అతనికి చెబితే అప్పటి నుంచి దుర్భాషలాడుతూ.. బెదిరింపులు పాల్పడుతున్నాడు. మోసానికి పాల్పడిన శ్యాంసుందర్‌పై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని ఎస్పీని కోరాను.
- రవికుమార్(బాధితుడు)
దీని పై ఎస్పీ విశాల్ గున్నీ స్పందిస్తూ... ఇటీవల కాలంలో మాయమాటలతో మోసగిస్తున్నారనే ఫిర్యాదులు అధికంగా వస్తున్నాయని ఆయా ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా చీటింగ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయనీ ప్రజలు అప్రమత్తంగా ఉండి వాస్తవాలను గ్రహించి మెలగాలన్నారు. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి, నిరుద్యోగులకు ఆశలు కల్పించి, నకిలీ సంస్థల పేరుతో ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి వారివద్ద నుండి డబ్బులు తీసుకుని, తర్వాత ముఖం చాటేస్తున్నారు. అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఎవరైనా అటువంటి విధముగా ఉద్యోగం ఇప్పిస్తానని వస్తే వెంటనే వారి వివరాలను డయల్ 100కు తెలియజేయాలని కోరారు.
ఇదీ చదవండీ...