ETV Bharat / state

వైద్యురాలి మోసం..లబోదిబోమంటున్న మాజీ సైనికుడి కుటుంబం

ఆస్పత్రి పెడుతున్నామంటూ ఓ వైద్యురాలు తమ వద్ద డబ్బు తీసుకుని మోసం చేసిందని ఓ ఆర్మీ మాజీ సైనికుడి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ వద్ద నుంచి రూ. 60లక్షలు, బంగారం, ఇంటి కాగితాలు తీసుకుందని బాధితులు తెలిపారు. ఈ సంఘటన గుంటూరు జిల్లాలో జరిగింది.

ఓ ఆర్మీ మాజీ సైనికుడి కుటుంబాన్ని మోసం చేసిన ఎస్సై భార్య

author img

By

Published : Nov 11, 2021, 9:53 PM IST

మాజీ సైనికుడి కుటుంబాన్ని మోసం చేసిన వైద్యురాలు

గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆస్పత్రి పెడుతున్నామంటూ ఓ వైద్యురాలు తాడేపల్లి మండలం ఇప్పటంలో మాజీ సైనికుడి వద్ద రూ.60 లక్షలు తీసుకొని ముఖం చాటేసింది.

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..

మాజీ సైనికుడు కార్తీక్ భార్యకు వైద్యురాలు రోజారాణి ఫిజియోథెరపీ చేసింది. ఈ క్రమంలో కుటుంబసభ్యులతో చనువుగా మెలిగిన రోజా మంగళగిరిలో ఆస్పత్రి పెడుతున్నామని.. బ్యాంకు నుంచి కోటిన్నర వస్తోందని నమ్మబలికి.. కార్తీక్ వద్ద రూ.60లక్షలు, ఆయన ఇంటి కాగితాలు తీసుకుంది. వారంలో ఇస్తానని చెప్పి నెలలు గడుస్తున్నా రోజా నుంచి సమాధానం లేకపోవడంతో ఈ ఏడాది జులైలో గట్టిగా నిలదీశారు. ఆగస్టులో తన పెళ్లి ఉందని.. అది కాగానే ఇస్తానని చెప్పడంతో కార్తీక్ కాస్తా ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత డబ్బులు అడిగితే మీరు ఎవరో తనకు తెలియదని వైద్యురాలు చెప్పిందని బాధితులు వాపోయారు. స్పందన కార్యక్రమంలో భాగంగా రోజారాణి, ఆమె భర్త ఎస్సై వినోద్ కుమార్​పై బాధితులు ఫిర్యాదు చేశారు.

"ఆసుపత్రి నిర్మాణం కోసమని రోజారాణి అనే వైద్యురాలు తమ వద్ద రూ.60లక్షలు తీసుకుంది. అంతేకాకుండా రూ.10 లక్షలు విలువ చేసే బంగారాన్ని కూడా ఆమెకు ఇచ్చాం. ఆమె కొద్ది రోజుల క్రితం పెదకాకాని ఎస్సై వినోద్​కుమార్​ను పెళ్లి చేసుకుంది. తమ డబ్బులు ఇవ్వమంటే ఇవ్వడం లేదు. ఆమె భర్త ఎస్సై కావడం చేత మాకు భయం వేస్తోంది" -కార్తీక్​, బాధితుడు

సంపాదించినదంతా రోజాకి ఇచ్చామని బాధితులు కన్నీటిపర్యంతమవుతున్నారు. డబ్బులు ఇవ్వకపోతే ఆత్మహత్య తప్ప తమకు మరో దారి లేదని బాధితులు వాపోతున్నారు.

ఇదీ చదవండి:

BJP leaders protest: సీఐ ఇస్మాయిల్​ను సస్పెండ్ చేయాలి: భాజపా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.