ETV Bharat / state

గుండెపోటుతో భర్త మృతి.. చూసి తట్టుకోలేక భార్య కూడా.. - latest crime news in warangal

couple died in Bhupalappalli: భర్త అడుగుజాడల్లోనే భార్య నడవాలని పెద్దలు చెబుతారు. ఈ విషయాన్ని నిజం చేశారు తెలంగాణ జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలోని ఓ దంపతులు. భర్త ఒక్కసారిగా గుండెపోటుతో చనిపోయాడు. ఆ విషయాన్ని భరించలేక భార్య కూడా ఆత్మహత్య చేసుకుంది.

couple died in Bhupalappalli
couple died in Bhupalappalli
author img

By

Published : Jan 25, 2023, 7:23 PM IST

couple died in Bhupalappalli: భర్తతో పాటే భార్య జీవితం ముడిపడి ఉంటుంది. కష్టాల్లోను, సుఖాల్లోను భర్తకు తోడు ఉండేది భార్య మాత్రమే. అలానే ఓ భార్య చావులో కూడా తోడు వెళ్లింది. భర్త చనిపోవడం భరించలేక భార్య కూడా మృతి చెందిన ఘటన తెలంగాణ జయశంకర్​ భూపాలపల్లిలో జరిగింది. కుటుంబ సభ్యులు, స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. జయశంకర్​ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలానికి మోరంచపల్లి గ్రామానికి చెందిన చుక్క సారయ్య(55)కు ఇద్దరు భార్యలు. అతనికి మెుదటి భార్యకి ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. వీరందరికి వివాహమైంది. పెద్ద కుమారుడు కొన్ని సంవత్సరాల క్రితమే మృతి చెందాడు.

కొన్ని రోజులు గడిచిన తరవాత సారయ్య, కవిత(50)ను రెండో వివాహం చేసుకున్నాడు. అతను రెండో వివాహం చేసుకోవడం వలన మెుదటి భార్యతో నిత్యం గొడవలు అవుతుండేవి. దీంతో మెుదటి భార్య, పిల్లలు వారిని వదిలేసి వెళ్లిపోయారు. చివరికి అతడు, తన రెండో భార్యతో కలిసి మోరంచపల్లిలో నివాసం ఉన్నారు. అయితే అర్ధరాత్రి సారయ్య గుండెపోటుతో మరణించాడు.

ఈ విషయం తట్టుకోలేని కవిత అతడి మృతి దేహం పక్కనే తెల్లవారుజామున ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తెల్లవారిన ఎంతకూ ఇంటి తలుపులు తీయకపోవడంతో చుట్టుపక్కల వారు వచ్చి చూడగా.. దంపతులిద్దరూ విగతజీవులుగా కనిపించారు. మృతదేహాలను చూస్తూ బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

ఆ ఇంట్లో వారిద్దరే ఉండడంతో ఈ సంఘటన ఎలా జరిగిందో తమకు తెలియదని చిన్న కుమారుడైన కార్తీక్​ తెలిపాడు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం చేయడం కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు.

"మేము అందరం కలిసి ఉండడం లేదు. మేము ఇద్దరు అన్నదమ్ములం. మా నాన్నకి మాకు కుటుంబ కలహాలు వచ్చి విడిపోయాం. మా అన్నయ్య చనిపోయాడు. మా చెల్లి మోరంచపల్లిలోనే పెళ్లి చేసుకుని ఉంటుంది. నేను భూపాలపల్లిలో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నా. నాన్న చనిపోయాడన్న విషయం తెలియగానే ఇక్కడకి వచ్చాను. ఇక్కడకి వచ్చి చూస్తే ఆమె కూడా చనిపోయి ఉంది. నేను ఇక్కడ లేనందున ఈ సంఘటన ఎలా జరిగిందో పూర్తిగా తెలియలేదు." - కార్తీక్ ,మృతుని చిన్న కుమారుడు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.