A boy stuck in a bowl in Warangal district: రెండేళ్ల బాలుడు కొప్పెర గిన్నెలో ఇరుక్కుపోయిన ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం మూడెత్తుల తండాలో చోటు చేసుకుంది. తల్లిదండ్రులు వారి పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు అక్కడే ఆడుకుంటున్న బాలుడు.. పక్కనే ఉన్న కొప్పెరలోకి దిగాడు. అంతే అందులో ఇరుక్కుపోయి బయటకు రావడానికి తంటాలు పడ్డాడు.
ఎంతకీ బయటకు రాకపోవడంతో ఏడుపు మొదలుపెట్టాడు. గమనించిన తల్లిదండ్రులు కొప్పెరలో తమ కుమారుడు ఇరుక్కుపోవడం చూసి షాకయ్యారు. ఆ బుడ్డోడిని బయటకు తీసేందుకు నానాతంటాలు పడ్డారు. ఎంతకీ బయటకురాకపోవడంతో స్థానికంగా ఉన్న వెల్డింగ్ షాపునకు తీసుకెళ్లారు. అక్కడి సిబ్బంది కట్టర్ల సాయంతో కొప్పెరను కట్ చేసి బాలుడిని సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం ప్రాథమిక చికిత్స కోసం తల్లిదండ్రులు ఆ బాలుడిని ఆస్పత్రికి తరలించారు.
ఇవీ చదవండి: