రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న దీక్షలు 88వ రోజుకు చేరాయి. మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, నిడమర్రు, తాడేపల్లి మండలం పెనుమాక, ఉండవల్లిలో రైతులు దీక్షలు కొనసాగించారు. కృష్ణాయపాలెంలో రైతులు, మహిళలు బైబిల్ పఠించారు. ఏసు ప్రభువే జగన్ మనస్సు మార్చాలని ప్రార్థనలు చేశారు. పెనుమాక, ఎర్రబాలెంలో రైతులు, మహిళలు దీక్షలో పాల్గొన్నారు. ప్రజలను మోసం చేసే నేతలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టి బుద్ధి చెప్పాలని మహిళలు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి