Corona Cases in gurukul school: గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని ఏపీ గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేపింది. పాఠశాలలో చదువుతున్న 8మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్థరణ అయింది. అప్రమత్తమైన అధికారులు.. గురుకులంలో చదువుతున్న విద్యార్థుల్లో జలుబు, జ్వరం వంటి లక్షణాలున్న వారిని ఇళ్లకు పంపిస్తున్నారు. ఇప్పటివరకూ 100 మందికిపైగా పంపించినట్లు గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ తెలిపారు. ఇంకా పాఠశాలలో 230మంది విద్యార్థులున్నారు. ప్రస్తుతం ఈ పాఠశాల అద్దెకు తీసుకున్న రేకుల షెడ్లలో నడుస్తోంది. ఇరుకు గదులు కావటంతో విద్యార్థులు కోవిడ్ నిబంధనలు పాటించలేని దుస్థితి నెలకొంది. ఫలితంగా వైరస్ వేగంగా వ్యాపించే ప్రమాదం ఉంది. గురుకుల పాఠశాల కోసం అన్ని వసతులతో చిలకలూరిపేట మండలం రాజాపేటలో కొత్త భవనాన్ని నిర్మించారు. ఏడాది క్రితమే నిర్మాణం పూర్తైనా విద్యుత్ కనెక్షన్ లేకపోవటంతో పాత షెడ్లలోనే తరగతులు, హాస్టల్ కొనసాగిస్తున్నారు. ఈటీవీ కథనాలతో అధికారులు విద్యుత్ కనెక్షన్ ఇచ్చినప్పటికీ కొత్త భవనాన్ని అధికారికంగా ప్రారంభించకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడంలేదు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి
రాష్ట్రంలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి.. ఒక్కరోజే 12,561 కరోనా కేసులు, 12 మరణాలు