ETV Bharat / state

జాతీయ రహదారులపై చోరీలకు పాల్పడుతున్న రెండు ముఠాలు అరెస్ట్ - గుంటూరు చోరీ గ్యాంగ్ అరెస్ట న్యూస్

లారీలు, ద్విచక్ర వాహనాలే లక్ష్యంగా గుంటూరు జిల్లాలోని జాతీయ రహదారిపై చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నగదు, ద్విచక్ర వాహనం, సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

8 members  arrest in robbery cases on guntur high way

author img

By

Published : Oct 13, 2021, 3:46 PM IST

గుంటూరు జిల్లాలో జాతీయ రహదారులపై దోపిడీలకు పాల్పడుతున్న రెండు ముఠాలను నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 70 వేల రూపాయలు, ద్విచక్రవాహనం, సెల్​ఫోన్లు స్వాధీనం చేస్కున్నారు. ఓ కేసులో ఐదుగురిని, మరో కేసులో ముగ్గురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు.

జాతీయ రహదారిపై వెళ్తున్న లారీలు, ద్విచక్ర వాహనాలు లక్ష్యంగా వీరు దోపిడీలకు పాల్పడుతున్నట్లు గుంటూరు దక్షిణ మండల డీఎస్పీ జెస్సీ ప్రశాంతి చెప్పారు. హైవే భద్రతపై మరింత దృష్టి సారించామని.. పాత నేరస్తుల కదలికలపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నామని చెప్పారు. బయోమెట్రిక్ విధానంలో అనుమానితుల వేలిముద్రలను సేకరిస్తున్నామని.. ఎవరైనా పాత కేసుల్లో తప్పించుకుని తిరిగితే అదపులోకి తీసుకుంటున్నామని డీఎస్పీ జెస్సీ ప్రశాంతి చెప్పారు.

ఇదీ చదవండి: Duggirala MPP: కలెక్టరేట్​కు దుగ్గిరాల ఎంపీపీ కుల ధ్రువీకరణ వివాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.