జిల్లాలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 41 వేల 566 మంది ఇంటికి చేరుకున్నారు. తాజాగా వైరస్ ప్రభావంతో ఐదుగురు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 492కి చేరింది. రాష్ట్రంలోనే అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలో గుంటూరు 5వ స్థానంలో ఉంది. ఇక మరణాల విషయంలో గుంటూరు జిల్లా రెండో స్థానంలో నిలిచింది. జిల్లాలో అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలు చూస్తే గుంటూరు, నరసరావుపేట, మంగళగిరి, తాడేపల్లి, బాపట్ల, మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో ఉన్నాయని అధికారులు తెలిపారు.
కొత్తగా నమోదైన కేసుల్లో గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 54 కేసులు నమోదయ్యాయి. మండలాల వారీగా నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. నరసరావుపేట-60, మంగళగిరి-40, తుళ్లూరు-30, యడ్లపాడు-26, నకరికల్లు-20, అచ్చంపేట-19, కారంపూడి-17, పొన్నూరు-17, పిడుగురాళ్ల-12, సత్తెనపల్లి-12, రొంపిచర్ల-12, రేపల్లె-11, గుంటూరు గ్రామీణ ప్రాంతం-11 చొప్పున కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.
ఇదీ చదవండి: నాన్న ఆహారం తీసుకుంటున్నారు: ఎస్పీ చరణ్