గుంటూరులో 43వ రోజుకు చేరిన ఐకాస రిలే దీక్షలు - amaravathi issue
రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని గుంటూరు కలెక్టరేట్ వద్ద రాజకీయ ఐకాస చేపట్టిన రిలే దీక్షలు 43వ రోజుకు చేరాయి. మాజీమంత్రి నక్కా ఆనందబాబు దీక్షా శిబిరాన్ని సందర్శించి ప్రసంగించారు. గాంధీ మహాత్ముని మార్గంలో ప్రశాంతంగా ఉద్యమిస్తుంటే ప్రభుత్వం పోటీగా ప్రదర్శనలు చేస్తూ రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వం కుట్ర పూరితంగా తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం వెనక్కి తీసుకునే వరకూ ఉద్యమిస్తూనే ఉంటామని హెచ్చరించారు.
గుంటూరులో 43వ రోేజుకు చేరిన రిలే దీక్షలు
TAGGED:
amaravathi issue