Rs. 4 Crore Fraud in Guntur District: గుంటూరు జిల్లా పిరంగిపురం మండలంలో రూ. 4 కోటు ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ముపాళ్ల మండలం నార్నెపాడు గ్రామానికి చెందిన మహమ్మద్ గౌస్, అతని కుమారుడు సాధిక్.. పిరంగిపురం మండలం బేతపూడిలో పురుగు మందులు వ్యాపారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే చిట్టీలు, వడ్డీ వ్యాపారం వంటివి చేసేవారు. ఈ నేపథ్యంలో బేతపూడి, గుండాలపాడు, నార్నెపాడు సమీప గ్రామాలకు చెందిన 49 మందికి రూ. 4 కోట్లు బకాయి పడ్డారు. అయితే.. కొద్దిరోజులుగా బేతపూడి గ్రామంలోని పురుగు మందులు దుకాణాన్ని మూసివేశారు. అనుమానంతో స్థానికులు ఆరా తీయగా.. వ్యాపారులు, తండ్రీకొడుకులు మహమ్మద్ గౌస్, సాధిక్ ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది. దీంతో రూ.4 కోట్లు మోసపోయామని తెలుసుకున్న బాధితులు.. పిరంగిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: