గుంటూరు జిల్లా అచ్చంపేట మండలానికి చెందిన గృహిణి ప్రవల్లిక.. ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. నాలుగేళ్ల క్రితం అచ్చంపేట మండలం నీలేశ్వరపాలేనికి చెందిన కొట్టే నరేష్‌తో ఆమెకు వివాహమైంది. నాటి నుంచి సంతానం కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి.. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో డాక్టర్ సునీత దగ్గర చికిత్స తీసుకున్నారు.
ఆ తర్వాత కొన్నాళ్లకు గర్భం దాల్చిన ప్రవల్లిక.. ముగ్గురు చిన్నారులకు జన్మనిచ్చింది. ఒక అమ్మాయి, ఇద్దరు మగ పిల్లలు పుట్టారని.. తల్లీపిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. నాలుగేళ్ల నిరీక్షణ అనంతరం.. ఇలా ఒకేసారి ముగ్గురు పిల్లలు పుట్టడంపై.. ప్రవల్లిక నరేష్ దంపతులతో పాటు.. వారి కుటుంబీకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: