కృష్ణా జిల్లా నూజివీడు ఐఐఐటీ విద్యార్థిని అజ్మల్ సుల్తానా అరుదైన ఘనత సాధించింది. ప్రతిష్టాత్మకమైన యూరోపియన్ స్కాలర్షిప్కు ఎంపికైంది. ఐఐఐటీలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన సుల్తానా విదేశాల్లో పీజీ చేయాలన్న లక్ష్యంతో స్కాలర్షిప్ అందజేసే సంస్థలు నిర్వహించే పరీక్షలో సత్తా చాటి... 20 లక్షల రూపాయల ఉపకారవేతనాన్ని సాధించింది.
ఇందులో భాగంగా మొదటి సంవత్సరం ఎం ఎస్. గ్రెస్ బెల్ విశ్వవిద్యాలయంలో, రెండో సంవత్సరం జర్మనీలోని యూనివర్శిటీలో పీజీని పూర్తి చేసే అవకాశం లభించింది. చివరి సంవత్సరంలో సుల్తానా చేసిన ప్రాజెక్టు గురించి ఓ ఇంటర్నేషనల్ జర్నల్ ప్రముఖంగా ప్రచురించింది. ఈ సందర్భంగా ఆమెను ఐఐఐటీ అధ్యాపక బృందం ఘనంగా సన్మానించింది.
ఇదీ చదవండి:'లింగమనేని ఐ.జే.ఎం టౌన్షిప్పై విచారించాలి'