ETV Bharat / state

శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

gold seizure at Shamshabad airport: ఈరోజుల్లో స్మగ్లింగ్‌ చేయడం పలు రకాలు .. అందులో విమానం ద్వారా రవాణా చేయడం ఒక విధానం. అదే విధంగా ఒక ప్రయాణికుడు బంగారాన్ని రవాణా చేయడానికి ప్రయత్నించాడు. విమానాశ్రయం నుంచి బయటకి వస్తుండగా పర్యవేక్షణ అధికారులకు అతని పై అనుమానం రావడంతో తనిఖీ చేయగా .. ఎక్కువ మెత్తంలో బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంతకి ఇది ఎక్కడ జరిగిందంటే ..

gold seizure
బంగారం పట్టివేత
author img

By

Published : Dec 10, 2022, 5:59 PM IST

gold seizure at Shamshabad airport : శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. ఈరోజు ఉదయం తెల్లవారుజామున దుబాయ్ నుంచి ఎఫ్‌జడ్‌ 461 విమానంలో వచ్చిన ఓ ప్రయాణికుడిని తనిఖీ చేయగా.. అనుమానిత బ్యాగ్ కనిపించింది. క్షుణ్ణంగా అధికారులు పరిశీలించగా దొరికిన స్మగ్లింగ్‌ బంగారం కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ బ్యాగేజీలో 24 క్యారెట్ బంగారం బిస్కెట్లు, 1414 గ్రాముల బరువు గల 18 క్యారెట్ ఆభరణాలు లభ్యమయ్యాయి.

సుమారు 1.38 కోట్ల రూపాయలు విలువైన మొత్తం 2961 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. బంగారం అక్రమంగా తెచ్చిన ప్రయాణికుడిపై కేసు నమోదు చేశారు. ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని కస్టమ్స్ అధికారులు విచారిస్తున్నారు. దుబాయ్ నుంచి దొంగచాటుగా భారత్‌లో బంగారం బిస్కెట్లు, ఆభరణాలు ఎవరికి చేరవేయడానికి తెస్తున్నారన్న కోణంలో కస్టమ్స్ అధికారులు లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.