ETV Bharat / state

పోరాటాన్ని వైసీపీ సర్కార్‌ అణచివేసేందుకు యత్నిస్తోంది - అంగన్వాడీల ఆగ్రహం - Criticism of Anganwadis against Govt

13th Day of Anganwadis Protests in AP : సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు 13వ రోజూ కదం తొక్కారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు తగ్గేదే లేదంటూ వినూత్న నిరసనలతో హోరెత్తించారు. తమ పోరాటాన్ని వైసీపీ సర్కార్‌ అణచివేసేందుకు యత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఆటంకాలు ఎదురైనా, తమ డిమాండ్లు నెరవేర్చేవరకు ఉద్యమం ఆగదని హెచ్చరించారు.

13th_Day_of_Anganwadis_Protests_in_AP
13th_Day_of_Anganwadis_Protests_in_AP
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 24, 2023, 4:09 PM IST

13వ రోజు కదం తొక్కిన అంగన్వాడీలు - తమ పోరాటాన్ని వైసీపీ సర్కార్‌ అణచివేసేందుకు యత్నిస్తోందని ఆగ్రహం

13th Day of Anganwadis Protests in AP : డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు చేపట్టిన సమ్మె పదమూడో రోజూ ఉద్ధృతంగా సాగింది. జగన్‌ ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ నిరసనలతో పెద్దఎత్తున ఆందోళనలు చేశారు. వీరికి మద్దతుగా విపక్షాలు, ప్రజాసంఘాలు సంఘీభావంగా ఆందోళనల్లో పాల్గొన్నాయి. సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్‌తో 12రోజులుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని అంగన్వాడీలు మండిపడ్డారు.

సీఎం జగన్​కు కనపడదా, వినపడదా - పన్నెండో రోజూ కదం తొక్కిన అంగన్వాడీలు

ప్రకాశం జిల్లా ఒంగోలులో అంగన్వాడీల సమ్మె 13వరోజు కొనసాగుతోంది. కలెక్టరేట్ వద్ద బైఠాయించి కనీస వేతనం రూ.26 వేలు రూపాయలు ఇవ్వాలని అంగన్వాడీలు డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన హామీలు నాలుగున్నర ఏళ్లైన నేరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టిన సచివాలయం సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Concerns of Anganwadis in Prakasam District : అదేవిధంగా అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో అంగన్వాడీ సిబ్బంది రాస్తారోకో నిర్వహించారు. నరసన్నపేట ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి హాజరై నిరసన కారులకు సంఘీభావం తెలిపారు. అంగన్వాడీ సిబ్బంది సమస్యల పరిష్కరించాలంటూ ఆయన డిమాండ్ చేశారు.

సమస్యలతో సతమతమవుతున్న అంగన్వాడీ అక్కచెల్లెమ్మలు - పట్టించుకోని జగన్‌ సర్కారు

ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డికి తమ సమస్యలను చెబితే అర్థం కావట్లేదని గుంటూరు జిల్లాలో అంగన్వాడీలు మండిపడ్డారు. అందుకే బుర్రకథ రూపంలో అంగన్‌వాడీల సమస్యలను వినిపిస్తున్నామని తెలిపారు. గుంటూరు కలెక్టరేట్‌ వద్ద 13వ రోజున అంగన్‌వాడీల సమ్మె కొనసాగింది. సమ్మెలో భాగంగా బుర్రకథ రూపంలో అంగన్‌వాడీలు వారి సమస్యలను తెలుపుతూ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ సమస్యలను పరిష్కరించాలని లేకుంటే సమ్మెను కొనసాగిస్తామని అంగన్‌వాడీలు హెచ్చరించారు.

Demands of Anganwadis : బాపట్ల పట్టణంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన సమ్మె పదమూడో రోజూకు చేరింది. బాపట్ల ఐసీడీఎస్ కార్యాలయం నుంచి పాత బస్టాండ్ వరకు కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వం స్పందించాలని కోరుతూ పాత బస్టాండ్ సెంటర్​లో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం అంగన్వాడీల సమస్యల పరిష్కరించకుండా కేంద్రాలు తాళాలు పగలగొట్టడం దుర్మార్గమని మండిపడ్డారు. విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయం నిర్మాణం పేరుతో వందల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం తమ వేతనాలు ఎందుకు పెంచడం లేదని విమర్శించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా తమకు వేతనాలు పెంచకుంటే జీవించేది ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు. తము న్యాయమైన డిమాండ్​లు చేస్తుంటే వేధింపులేంటని ప్రశ్నించారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు, పోలీసు వాహనాల అద్దలు తుడిచి అంగన్వాడీలు నిరసన తెలియజేశారు.

సమస్యలను పరిష్కరించకుంటే వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిని గద్దె దింపుతాం: అంగన్వాడీలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.