రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 11వ పీఆర్సీని వెంటనే విడుదల చేయాలని.. ఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే రెండున్నర సంవత్సరాలు పూర్తైందని.. ప్రభుత్వం ఇప్పటికైనా పీఆర్సీని విడుదల చేయాలన్నారు. కరోనా కారణంగా.. చాలా కుటుంబాల్లో ఆర్థిక భారం ఉందని, కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఇవ్వాల్సిన మూడు డీఏలను నిలుపుదల చేయటాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు.
ఉద్యోగులకు ఇచ్చిన హామీలైన.. సీపీఎస్ రద్దు చేసి, పాత పింఛన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని, కాంట్రాక్డు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని ఆయన కోరారు.
ఇదీ చదవండి: