గుంటూరులో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. వేడుకలకు వచ్చిన తెనాలికి చెందిన 101 ఏళ్ల కన్నెగంటి సీతారామయ్య అనే వ్యక్తి కుప్పకూలిపోయారు. స్పృహతప్పి పడిపోయిన ఆయనకు డీఎంహెచ్‌వో యాస్మిన్ ప్రాథమిక వైద్య సేవలు అందించారు. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అతనిని 108 వాహనంలో జీజీహెచ్‌కు తరలించే ఏర్పాట్లు చేశారు. ఐసీయూలో ఉంచి వైద్య చికిత్సలు అందిస్తున్నారు.
ఇదీ చదవండి: జనసేన ప్రధాన కార్యాలయంలో గణతంత్ర దినోత్సవాలు